'ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి'
MHBD: నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం గ్రామంలో నిన్న రాత్రి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గ్రామ ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామస్తులు ఏకతాటిపై ఉంటూ గ్రామంలో సీసీ కెమెరాలు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.