ఎస్పీ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు
JGL: విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.