WWC ఫైనల్: భారీ స్కోరు దిశగా టీమిండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 28 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సెంచరీకి చేరువలో ఉన్న ఓపెనర్ షఫాలీ వర్మ 87 పరుగులు చేసి అయబొంగా ఖాకా బౌలింగ్‌లో అవుటైంది. ప్రస్తుతం క్రీజులో జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఉన్నారు.