'తెగిపోయిన కల్వర్టుకు తాత్కాలిక మరమ్మతులు'

'తెగిపోయిన కల్వర్టుకు తాత్కాలిక మరమ్మతులు'

KMR: జుక్కల్ నుంచి దోస్త్‌పల్లి వెళ్లే మార్గమధ్యలో కల్వర్టు తెగిపోవడంతో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జేసీబీ సాయంతో మొరం వేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు మరమ్మతు పనులు చేపట్టినట్లు చెప్పారు.