జిల్లాలో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్..!
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు TGDPS తెలిపింది. పొడి వాతావరణం ఏర్పడుతుందని, నవంబర్ 10 తర్వాత చలి తీవ్రతతో పాటుగా, మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. వాతావరణంలో వినూత్న మార్పులు జరుగుతున్నాయని, ఈ ఏడాది గతంతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉన్నట్లుగా వివరించింది.