త్వరలో 1,433 పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి

త్వరలో 1,433 పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి

KRNL: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని మంగళవారం మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. '142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం. స్కాలర్షిప్ల కోసం రూ. 420 కోట్లను కేటాయించాం' అన్నారు.