NST కమిషన్ మెంబర్‌ను కలిసిన రైతులు
RR: గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు తమ పట్టా భూములను తీసుకోవద్దని గత 29 రోజులుగా మర్లకుంట తండా, మంగలిగడ్డ తండా గ్రామాల రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో NST కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి తమ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఇబ్రహీంపట్నం RDOతో మాట్లాడి 15 రోజుల్లో పట్టా భూములపై నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.