శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
TPT: ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి నేడు TTD తరఫున పట్టువస్త్రాలు సమర్పించినట్లు ఛైర్మెన్ బీఆర్.నాయుడు తెలిపారు. పట్టువస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 2006 నుంచి ప్రాచీన శ్రీ వైష్ణవ క్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తునట్లు ఆయన పేర్కొన్నారు.