వసతిగృహాల సిబ్బందిని బెదిరించి వసూళ్లు
SS: విద్యార్థి సంఘాల పేరుతో ప్రభుత్వ వసతిగృహాలకు వెళ్లి బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీ, వార్డెన్లు ఫిర్యాదు మేరకు కదిరికి చెందిన అరుణ్, ఉపేంద్రతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకున్నారు. వసతిగృహాల్లో తప్పులు జరుగుతున్నాయని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.