VIDEO: ఆళ్లగడ్డలో దుర్గా భవాని గ్రామోత్సవం వైభవం
KRNK: ఆళ్లగడ్డ శ్రీ కాళికామాత ఆలయంలో చండీయాగం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, శుక్రవారం రాత్రి భక్తులు దుర్గా భవాని గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సింహవాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్‌పై పట్టణ వీధుల్లో భజనలు, మేళతాళాల నడుమ ఊరేగింపుతో ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు.