25 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఇస్లాంపేటలో అక్రమంగా నిలువ ఉంచిన 25 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యాగటీల స్వాతి ఆదివారం పట్టుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారన్న సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి గిద్దలూరు గోడౌన్‌కి తరలించారు. అక్రమంగా బియ్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.