జిల్లా కేంద్రంలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

జిల్లా కేంద్రంలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

MBNR: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పట్టణంలోని వన్ టౌన్ చౌరస్తా నుంచి రైచూర్ వైపు వెళ్లే దారిలో మురుగునీరు పెద్ద ఎత్తున ప్రధాన రహదారి 167 పైకి చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ దాదాపు మోకాళ్ళ లోతు నీరు రోడ్డుపై పారింది.