ఎన్నికల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు

కృష్ణా: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రానా అన్నారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద గట్టి నిఘా పెట్టి, ఇప్పటికీ నాలుగు కోట్ల నగదును సీజ్ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం పక్కన ఉండడంతో మద్యం పైన కూడా దృష్టి సారించామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేసామన్నారు.