VIDEO: విద్యుత్ షాక్‌తో రైతు మృతి
MNCL: దండేపల్లి మండలంలోని నంబాలలో విద్యుత్ షాక్ తగిలి ఓ రైతు మృతి చెందాడని స్థానిక ఎస్సై తహసిద్దీన్ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన దాసరి శేఖర్(35) అనే రైతు బుధవారం ఉదయం తన పొలానికి వెళ్లే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న దండేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.