ఏనుగులు జనావాసాల్లో రాకుండా చర్యలు

ఏనుగులు జనావాసాల్లో రాకుండా చర్యలు

జిల్లాలోని పార్వతీపురం రేంజ్, గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్‌లో సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం" పనులను కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏనుగులు జనావాసాల్లో రాకుండా నిరోధించేందుకు అత్యాధునికమైన ఏనుగు నిరోధిక కందకాలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.