VIDEO: ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంబురాలు

NRPT: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి లభించడంతో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.