మృతురాలి కుటుంబానికి అండగా రాష్ట్ర అధ్యక్షులు

మృతురాలి కుటుంబానికి అండగా రాష్ట్ర అధ్యక్షులు

BHNG: వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఓర్సు పుష్ప అనారోగ్యంతో మృతి చెందగా, బుధవారం అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజల రమేష్ సహకారంతో మృతురాలి కుటుంబానికి 75 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుర్రం కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి గుంజ నరసింహ, నాయకులు పల్లపు దుర్గయ్య, పల్లపు రవి పాల్గొన్నారు.