కొనసాగుతున్న సునీల్ నాయక్ విచారణ

కొనసాగుతున్న సునీల్ నాయక్ విచారణ

VZM: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో విచారణ అధికారి & ఎస్పీ దామోదర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామ అరెస్ట్ సమయంలో నిబంధనల ఉల్లంఘన, వేధింపుల ఆరోపణలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది.