సీతాగొంది ఘటనలో నిందితులపై కేసు
ADB: గుడిహత్నూర్‌లోని సీతాగొంది పోలింగ్ కేంద్రం వద్ద గుమిగూడి కొందరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే క్రమంలో ఒక వ్యక్తికి గాయలయ్యాయి. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు మరికొందరు వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు, కారకులపై కఠిన చర్యలు తప్పవని సీఐ రమేష్ తెలిపారు.