పీఏసీ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం

GNTR: ఫిరంగిపురం మండలం బేతపూడి పీఏసీ ఛైర్మన్‌గా కూరపాటి మాబు, డైరెక్టర్లు శివాల శెట్టి నాగరాజు( జనసేన) , పచ్చల సుబ్బారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఫిరంగిపురం టీడీపీ మండల అధ్యక్షుడు మండవ చిన్న నరసింహారావు, జనసేన అధ్యక్షులు పూర్ణ పాల్గొన్నారు.