VIDEO: ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు

VIDEO: ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు

పార్వతీపురం మండలం కృష్ణపల్లి సమీపంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పెదమరికి నుంచి కారడవలస కూలి పనులకి మహిళలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.