కల్లు దుకాణం వద్ద ఘర్షణ.. ఒకరు మృతి
MDK: మెదక్ జిల్లా మాసాయిపేటలోని కల్లు దుకాణం వద్ద తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అయితే, దశరథ్ అనే వ్యక్తికి నలుగురు వ్యక్తులతో చిన్న వివాదం వచ్చింది. దీంతో మద్యం మత్తులో రెచ్చిపోయిన నిందితులు దశరథ్ తలపై బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.