అమ్మపల్లిలో ఘనంగా బోనాల పండుగ

MBNR: బాలానగర్ మండలంలోని అమ్మ పల్లె గ్రామంలో బుధవారం గ్రామస్తులు పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పులతో వాయిద్యాలతో పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిళ్ళ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు.