అలర్ట్.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు..!
AKP: రానున్న 3 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలతో పాటు, 50-60 Kmph కూడిన గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది.