నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ లైన్మెన్ విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. 33/11KV లైన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన కరెంటు యధావిధిగా ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.