VIDEO: దొండపాడు·మోటూరు రోడ్డుకు శంకుస్థాపన
కృష్ణా: గుడివాడ నియోజకవర్గ పరిధిలో రూ.18 కోట్లతో ఆర్ అండ్ బీ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ మండలం దొండపాడు - మోటూరు రహదారికి రూ. 2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.