దివ్యాంగుల స్వావలంబన కోసం ‘ఇగ్నైట్’ ప్రారంభం

దివ్యాంగుల స్వావలంబన కోసం ‘ఇగ్నైట్’ ప్రారంభం

అనంతపురంలో RTIH ఆధ్వర్యంలో ‘ఇగ్నైట్’ నైపుణ్యాభివృద్ధి శిక్షణను విభిన్న ప్రతిభావంతుల సంస్థ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి మంగళవారం ప్రారంభించారు. ‘ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త’ పథకంలో భాగంగా దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని తెలిపారు.