VIDEO: ప్రభుత్వ బడులకు గ్రంథాలయాల నిధులు
SRD: జిల్లాలోని 268 ప్రభుత్వ పాఠశాలలకు రూ.14 లక్షల గ్రంథాలయాల నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నిధులతో జిల్లాలోని ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని ఎస్సీఈఆర్టీ నిబంధన మేరకు పాఠశాలలకు పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచించారు. నిధులు పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు.