శతాధిక వృద్ధురాలు మృతి
KNR: జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామానికి చెందిన చిలుక వెంకటమ్మ 114 అనే వృద్ధురాలు బుధవారం మృతి చెందారు. వందేళ్లు దాటినా ఉత్సాహంగా ఉండేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటమ్మకు కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాలు, ముని మనుమలు అందరూ అర్థ సెంచరీకి పైగానే ఉన్నారు. వెంకటమ్మ మృతి పట్ల ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.