'వయోవృద్ధులు చట్టాలు ఉపయోగించుకోవాలి'

SRPT: వయోవృద్ధుల దినోత్సవంను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో, కోదాడ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ న్యాయవిజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధులు (సీనియర్ సిటిజన్స్) తమకు ఉన్న హక్కులు, చట్టాలు తెలుసుకొని ఉపయోగించుకోవాలని కోరారు.