'డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలి'
MDK: రామాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, ఆయుష్ శాఖ ఇంఛార్జ్ మద్దెల భరత్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకై వారితో ప్రతిజ్ఞ చేయించారు.