దుకాణంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

దుకాణంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

తూ. గో: గోపాలపురం మండలం చిట్యాల వద్ద గురువారం రాత్రి అదుపుతప్పి భారీ చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ షాపుపై బోల్తా పడింది. అదే సమయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తెగిపడటంతో మరో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ రెండు సంఘటనల్లోనూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.