రేపు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
KMM: రేపు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కల్లూరు మండలంలో పర్యటించనున్నట్లు ఆమె క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని చెన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలని కోరారు.