'ఖైదీల పట్ల వివక్ష చూపించరాదు'
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వులు మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణ ప్రసాద్ ఎస్.కోట సబ్ జైల్‌ను సందర్శించారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహిస్తూ, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల ఎటువంటి వివక్ష చూపించారదని సూచించారు.