VIDEO: ఉప్పల్లో IPL మ్యాచ్.. ఆరెంజ్ ఆర్మీ సందడి..!
HYD: ఉప్పల్లో IPL సందడి ప్రారంభమైంది. SRH అభిమానులతో స్టేడియం పరిసరాలు ఎక్కడ చూసినా ఆరెంజ్ మయంగా మారాయి. స్టేడియం వద్ద భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. “ఆరెంజ్ ఆర్మీ” నినాదాలతో ఉత్సాహం ఉరకలేస్తోంది. డ్రమ్స్‌తో స్టేడియం చుట్టూ హోరెత్తుతోంది. మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సందడి చేస్తూ, ఎంట్రీ ఇస్తున్నారు.