కేకే లైన్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు

కేకే లైన్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు

VSP: మోంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు కేకే రైల్వే లైన్‌లో బీభత్సం నెలకొంది. 63వ కిలోమీటర్‌ వద్ద రైలు ట్రాక్‌పై కొండ చరియలు విరిగి పడ్డాయి. మంగళవారం సాయంత్రం భారీగా కొండచరియలు ట్రాక్‌పై పడ్డాయి. అయితే ఆ సమయంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టారు.