12 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి

12 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్రహం (35) అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. అయితే తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆసుపత్రిలో కర్నూలు జిల్లాకు చెందిన బాలుడు(12) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అబ్రహం కుటుంబ సభ్యులు గుండెను దానం చేయడానికి అంగీకరించడంతో, డా. శ్రీనాథ్ రెడ్డి బృందం గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించారు.