11 మోడల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం: కలెక్టర్

11 మోడల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం: కలెక్టర్

SRCL: సిరిసిల్ల జిల్లాలో 11 మోడల్ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ మోడల్ ఇల్లు వీడియోను గురువారం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ. 5 లక్షల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తవుతుందన్నారు.400 చదరపు ఫీట్లలో జిల్లాలోని మండలాల్లో 11 మోడల్ ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించామన్నారు