రామకృష్ణారెడ్డి మృతికి వైసీపీ నేతల నివాళి
సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మారుతి రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపికే భర్త వేణు రెడ్డి శనివారం రాచపల్లి గ్రామానికి వెళ్లి రామకృష్ణారెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.