VIDEO: 'శ్రీ విద్య మరణానికి కారణమైన వారిని శిక్షించాలి'
HNK: కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న శ్రీవిద్య అనే విద్యార్థిని అధికారుల నిర్లక్ష్యం, సీనియర్ల వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ABSF జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం KUలోని VC కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. శ్రీవిద్య మరణానికి కారణమైన వారిని శిక్షించాలన్నారు.