నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: సీఐటీయూ
GDWL: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.వి. నరసింహ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు.