VDEO: కోతుల బెదిరింపుతో బావిలో పడిన యువకుడు
WGL: వర్ధన్నపేట పట్టణ శివారులో శుక్రవారం స్నేహితులతో కలిసి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో కోతులు బెదిరించడంతో నూనవన్ విక్రమ్ అనే యువకుడు బైక్‌తో సహా అదుపుతప్పి బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని బావి నుంచి బయటకు తీసి త్రీవంగా గాయపడిన యువకుడిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు.