బిచ్కుందలో మొక్కజొన్న కొనుగోలుకు రైతుల ధర్నా
KMR: బిచ్కుంద మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. జొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా, జుక్కల్ నియోజకవర్గంలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని కోరుతూ అధికారులను నిలదిశారు.