యువకుల సరదా... కుటుంబాల్లో విషాదం
కృష్ణా: సరదాగా భద్రాచలం వెళ్లిన యువకుల పర్యటన జిల్లాలోని పలు కుటుంబాల్లో విషాదం నిపింది. గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థుల్లో ఉయ్యూరుకు చెందిన నవదీప్ (19), తేజ (20) మరణించారు. తమ కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారి హృదయాలను కలచివేస్తున్నాయి. కాగా.. విదేశంలో ఉన్న నవదీప్ తండ్రి చేరుకునేలోపే ఈ దుర్ఘటన జరగడం మరింత విషాదాన్ని మిగిల్చింది.