నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

AP: తిరుమలలో ఇవాళ మ.12 గంటలకు TTD ఛైర్మన్ BR నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చించనున్నారు. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 24న ప్రభుత్వం తరపున CM దంపతులు శ్రీవారికి పట్టువస్ట్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై భేటీలో మాట్లాడనున్నారు.