ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ప్రత్యేక అధికారి

మన్యం: పాచిపెంట మండలం సరాయివలస గిరిజన బాలికలు ఆశ్రమ పాఠశాలను ప్రత్యేక అధికారి బొత్స అనంత లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు కోసం సిద్ధం చేసిన భోజనాలు రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వాష్ రూమ్స్ పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.