'ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు రావాలి'

'ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు రావాలి'

KMR: దోమకొండ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని తహశీల్దార్ సుధాకర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.