గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
MHBD: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తుందని సీఎం తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉన్నారు.