NEET పరీక్షకు 5 కేంద్రాలు: DEO

ELR: ప్రతి సంవత్సరం ఆన్‌లైన్ నిర్వహించే NEET (UG) పరీక్షలను పెన్ను, పేపర్ ద్వారా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ శుక్రవారం తెలిపారు. ఈనెల 4న నిర్వహించే పరీక్షలకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థినీ విద్యార్థులు 1:30 లోపు పరీక్ష కేంద్రాలకు రావాలని సూచించారు.