విద్యార్థినికి క్రికెట్ కిట్ అందజేసిన ఎమ్మెల్యే

విద్యార్థినికి క్రికెట్ కిట్ అందజేసిన ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థిని షేక్ సీమా జిల్లాస్థాయి క్రికెట్‌లో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఆమెకు ప్రాక్టీస్ కోసం క్రికెట్ కిట్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం అందజేశారు. రాష్ట్రస్థాయిలో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.